ఏబీఎన్ కథనంపై స్పందించిన క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్
ABN , First Publish Date - 2020-04-01T21:36:04+05:30 IST
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం దాతలను కదిలించింది.

మంచిర్యాల: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం దాతలను కదిలించింది. ఈ కథనాన్ని చూసిన క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి స్పందించారు. జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌కు చెందిన 150 మంది కూలీలకు నిత్యావసర సరుకులతోపాటు దస్తులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ ముగిసేవరకు కూలీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగంపై ఆధారపడి కొన్నివేలమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు జీవనోపాది పొందుతున్నారని అన్నారు. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ సందర్భంగా కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మంచిర్యాలలో చిక్కుకుపోయారన్నారు. వారు ఇక్కడ ఇబ్బందులు పడకుండా వారికి నిత్యావసరసరుకులు, కరోనా నివారణకు అవసరమైన సామాగ్రి అందజేస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసేవరకు వలస కార్మికులకు అండగా ఉంటామని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కూలీలు కృతజ్ఞతలు చెప్పారు.