సీఏఏకు వ్యతిరేకంగా సీపీఎం బహిరంగ సభ

ABN , First Publish Date - 2020-03-04T21:16:34+05:30 IST

‘రాజ్యాంగాన్ని రక్షించుకుందా-పౌరసత్వాన్ని కాపాడుకుందాం’ నినాదంతో పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ-మార్కిస్ట్ (సీపీఎం) బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక

సీఏఏకు వ్యతిరేకంగా సీపీఎం బహిరంగ సభ

సిద్దిపేట: ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందా-పౌరసత్వాన్ని కాపాడుకుందాం’ నినాదంతో పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ-మార్కిస్ట్ (సీపీఎం) బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌‌పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) లపై సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మనేని వీరభద్రం నిప్పులు చెరిగారు. ముస్లింలను ఈ దేశం నుంచి పంపించేయాలనే కుట్రతోనే ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శలు గుప్పించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌‌లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తమ్మనినే అన్నారు.

Updated Date - 2020-03-04T21:16:34+05:30 IST