రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సీపీఎం

ABN , First Publish Date - 2020-12-14T04:52:35+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సీపీఎం

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి  : సీపీఎం

చిట్యాల, డిసెంబరు 13: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్‌ చేశారు. చిట్యాలలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు రైతుల మను గడకు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. రైతులకు ఉపయోగపడే చట్టాలను సవరిం చాలన్నారు. అంబానీ సంస్థలకు సంబంధించిన వస్తువులను బహిష్కరిం చాలన్నారు. ఈనెల 17న భూపాలపల్లి జిల్లాలో సీపీఎం ప్లీనరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో బొట్ల చక్రపాణి, మల్లయ్య, దేవేందర్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:52:35+05:30 IST