బాధితుల కుటుంబాలను ఆదుకోండి: చాడ
ABN , First Publish Date - 2020-08-20T09:33:45+05:30 IST
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మృత్యువాత పడినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర

హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మృత్యువాత పడినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గండేడు మండలం పగిడాల గ్రామంలో మిద్దె కూలి శరణమ్మతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు భవాని, వైశాలి చనిపోవడం బాధాకరమన్నారు. వరి పంట నష్టపోయిన వారికి రూ.20 వేలు, ఇళ్లు పూర్తిగా కూలిన వారికి 10 వేలు, పాక్షికంగా కూలిన వారికి రూ.5 వేలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించాలన్నారు.