భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థ: నారాయణ

ABN , First Publish Date - 2020-06-19T09:57:54+05:30 IST

రాజకీయాల్లో సంఘ వ్యతిరేక శక్తులు పెరిగిపోయాయని, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ గురువారం

భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థ: నారాయణ

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో సంఘ వ్యతిరేక శక్తులు పెరిగిపోయాయని, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో తాజాగా జరుగుతున్న గొడవలు,  కొట్లాటలు చూస్తుంటే రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారి పోయిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటన ేస్వచ్ఛ అవసరమని, దాన్ని ఆటంకపరిచే పద్థతుల్లో ప్రభుత్వాలు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాయని  ఆరోపించారు. జర్నలిస్టులపై ఒత్తిడి, ఆంక్షలు పెరుగుతున్నాయన్నారు.  ప్రభుత్వ అధిపతులు వారిపై తప్పుడు కేసులు పెట్టి  ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు.


చేప పిల్లల పంపిణీలో అక్రమాలు:సీఎంకు తమ్మినేని లేఖ

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చేపడుతున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన లేఖలో ఆరోపించారు. అక్రమ టెండర్ల ద్వారా చేప పిల్లల పంపిణీ  కొనసాగుతోందని, అది సరైంది కాదని పేర్కొన్నారు. ఈ పథకం పూర్తిగా అవినీతి మయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-19T09:57:54+05:30 IST