అవసరమైతే లాక్‌డౌన్ బ్రేక్ చేస్తాం: నారాయణ

ABN , First Publish Date - 2020-05-18T17:51:08+05:30 IST

అవసరమైతే లాక్‌డౌన్ బ్రేక్ చేస్తాం: నారాయణ

అవసరమైతే లాక్‌డౌన్ బ్రేక్ చేస్తాం: నారాయణ

హైదరాబాద్: ప్రధాని మోదీ ఏక పక్షంగా మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ముక్దుమ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్ తక్షణ బాధితులు వలస, సంఘిత కార్మికులకు కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. కోవిడ్‌తో సంబంధం లేని ఇస్రో, ఎయిర్ ఫోర్స్, అటవీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారని...కోవిడ్ సంక్షోభం అడ్డం పెట్టుకుని ప్రేవైట్ వ్యవస్థలకు మోదీ ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం పదివేల రూపాయలు వలస కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ, నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేశారన్నారు. వలస కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. రేపు 19న వలస కార్మికుల కొరకు నిరసన కార్యక్రమం చేపడతామని... అవసరమైతే లాక్‌డౌన్‌ను బ్రేక్ చేస్తామని నారాయణ హెచ్చరించారు. 

Updated Date - 2020-05-18T17:51:08+05:30 IST