రేపు దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన: చాడ

ABN , First Publish Date - 2020-05-18T18:15:10+05:30 IST

రేపు దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన: చాడ

రేపు దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన: చాడ

హైదరాబాద్: మోదీ ప్రకటించిన ప్యాకేజి మేడి పండు, అంకెల గారిడీ ప్యాకేజి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. వలస కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మానవత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు. బొగ్గు గనులను ప్రేవేటు వ్యక్తులకు అప్పగించి పబ్బం గడుపుకోవలని చూస్తుందని విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాలకు దేశ సంపదను కట్టబెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని.... 20న సింగరేణి ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. Updated Date - 2020-05-18T18:15:10+05:30 IST