దేశ సమైక్యత కోసమే సీపీఐ పోరాటాలు

ABN , First Publish Date - 2020-12-27T05:22:45+05:30 IST

దేశ సమైక్యత కోసమే సీపీఐ పోరాటాలు

దేశ సమైక్యత కోసమే సీపీఐ పోరాటాలు
జనగామ సీపీఐ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న నాయకులు

జనగామ టౌన్‌, డిసెంబరు 26: దేశ సమైక్యత, సమగ్రత కోసమే సీపీఐ సమరశీల పోరాటాలు సాగిస్తుందని పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రాజరెడ్డి అన్నారు. సీపీఐ 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చొప్పరి సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం కమ్యూనిస్టు సిద్ధాంతం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో శ్రామిక రాజ్యస్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో బర్ల శ్రీరాములు, ఎం.జనార్దన్‌, మోటె శ్రీశైలం, నీల యాదగిరి, నగేశ్‌, రాజు, ఆది సాయన్న పాల్గొన్నారు.

ఘనంగా ఆవిర్భావ దినోత్సవం ..

దేవరుప్పుల: సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కడవెండిలో సీపీఐ ఆఽధ్వర్యంలో మండల కార్యదర్శి జీడి ఎల్లయ్య ఆపార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, దావిద్‌, సోమయ్య, పెద్ది యాదగిరి, సురేష్‌, బెజుగం ఎల్లయ్య, ఎడ్డ సోమనారాయణ, చింత వెంకన్న, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:22:45+05:30 IST