ఏబీఎన్‌ వరుస కథనాలకు స్పందించిన సీపీ సజ్జనార్‌

ABN , First Publish Date - 2020-11-07T22:24:25+05:30 IST

భూకబ్జాల ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వరుస కథనాలకు సీపీ సజ్జనార్‌ స్పందించారు. మాదాపూర్‌ భూ కబ్జాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.

ఏబీఎన్‌ వరుస కథనాలకు స్పందించిన సీపీ సజ్జనార్‌

హైదరాబాద్: భూకబ్జాల ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వరుస కథనాలకు సీపీ సజ్జనార్‌  స్పందించారు. మాదాపూర్‌ భూ కబ్జాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వారంరోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఏబీఎన్‌కు సజ్జనార్‌ చెప్పారు. రాజిరెడ్డి భూకబ్జాలపై 5 రోజులుగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. బెదిరింపులకు వెరవకుండా భూకబ్జాలపై ఏబీఎన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌లో కథనాలు ప్రసారం చేసింది. 


మరోవైపు హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువులో ఇప్పటికే చెరువు శిఖంలో పెద్దఎత్తున భవనాలు వచ్చేశాయి. ఎఫ్‌టీఎల్‌లోని సుమారు 10 ఎకరాల కబ్జాకు అధికార పార్టీలోని కొంతమంది పెద్దలు స్కెచ్‌ వేశారు. రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోయడం, చదును చేయడం.. ఆ తర్వాత పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టడం షరా మామూలుగా మారింది. ఈ చెరువును ఆక్రమంచి ఇప్పటి వరకు వెలిసిన నిర్మాణాలకు అడ్డు లేదు. దాంతో, కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా, ఐదు ఎకరాలకుపైగా ఎఫ్‌టీఎల్‌ భూమి కబ్జాకు గురైంది. దీని విలువ రూ.200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

Updated Date - 2020-11-07T22:24:25+05:30 IST