కువైత్‌ నుంచి హైదరాబాద్‌కు 163 మంది

ABN , First Publish Date - 2020-05-10T09:22:56+05:30 IST

విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రజల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి విమానం శనివారం కువైట్‌ నుంచి 163 మందితో బయలుదేరి...

కువైత్‌ నుంచి హైదరాబాద్‌కు 163 మంది

శంషాబాద్‌ రూరల్‌, జగిత్యాల, హైదరాబాద్‌ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రజల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి విమానం శనివారం  కువైట్‌ నుంచి 163 మందితో బయలుదేరి రాత్రి 10:12 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది. ఏర్పాట్లను సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. ప్రయాణికులను గచ్చిబౌలిలోని షేర్దాన్‌ హోటల్‌, కాచిగూడలోని హర్ష హోటల్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చేవారి  కోసం హైదరాబాద్‌లోని 29 హోటళ్లలో  పెయిడ్‌ క్వారంటైన్‌కు ఏర్పాట్లు చేశారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో 14 రోజులకు రూ.35వేలు, త్రీస్థార్‌ హోటళ్లలో రూ.15వేలు, సాధారణ హోటళ్లలో రూ.5వేలు ఫీజు నిర్ణయించారు. పేద కార్మికులకు ఉచితంగానే క్వారంటైన్‌ కల్పిస్తారు. 

Updated Date - 2020-05-10T09:22:56+05:30 IST