సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందే

ABN , First Publish Date - 2020-05-10T10:13:52+05:30 IST

కార్యాలయాలకు 33ుమంది సిబ్బంది హాజరయ్యే వెసులుబాటును కల్పించిన నేపథ్యంలో పలు సంస్థల ప్రతినిధులతో సీపీ సజ్జనార్‌ సమీక్ష నిర్వహించారు. పని ప్రదేశాల్లో...

సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందే

సీపీ సజ్జనార్‌


హైదరాబాద్‌ సిటీ, మే 9(ఆంధ్రజ్యోతి): కార్యాలయాలకు 33ుమంది సిబ్బంది హాజరయ్యే వెసులుబాటును కల్పించిన నేపథ్యంలో పలు సంస్థల ప్రతినిధులతో సీపీ సజ్జనార్‌ సమీక్ష నిర్వహించారు. పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేశారు. వాటి ప్రకారం..  33ు మినహా మిగతా వారికి వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలి. అందరూ ఒకే సారి కార్యాలయానికి రాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఉద్యోగి తప్పని సరిగా గుర్తింపు కార్డు ధరించాలి. డ్యూటీకి వచ్చి వెళ్లడానికి మాత్రమే వాహనానికి అనుమతి ఉంటుంది. రాత్రి 7నుంచి ఉదయం 7గంటల వరకూ అనుమతించరు. వాహనాల రద్దీ నివారణకు ఆయా సంస్థలు ఉద్యోగుల కోసం బస్సులను ఏర్పాటు చేసుకోవాలి. వాటి సీట్ల సంఖ్యలో సగం మంది, క్యాబుల్లో డ్రైవర్‌తో కలిపి ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. క్యాంటీన్లు నిర్వహించరాదు. .

Updated Date - 2020-05-10T10:13:52+05:30 IST