ప్రశాంతంగా పోలింగ్: సీపీ అంజనీకుమార్
ABN , First Publish Date - 2020-12-01T17:57:34+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీకుమార్ అన్నారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాతబస్తీలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అంజనీకుమార్ హెచ్చరించారు.
కాగా రీపోలింగ్ ఉన్నందున ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో పార్టీ గుర్తు మార్పుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఈసీ స్పందించింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో రీపోలింగ్ పూర్తయ్యే వరకు.. ఎలాంటి ఎగ్జిట్‌పోల్స్ ప్రసారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.