నా ఆవులను ఎత్తుకెళ్లారు

ABN , First Publish Date - 2020-12-26T07:51:33+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తులు తాను సాకుతున్న ఆరు ఆవులను ఎత్తుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఇప్పటివరకు వాటి ఆచూకీ దొరకలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నా ఆవులను ఎత్తుకెళ్లారు

మేతకు వదిలితే కబేళాలకు తరలిస్తున్నారు

సంగారెడ్డిలో చుట్టుపక్కల ఇదే పరిస్థితి

డీజీపీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినతి


సంగారెడ్డి క్రైం, డిసెంబరు 25: గుర్తుతెలియని వ్యక్తులు తాను సాకుతున్న ఆరు ఆవులను ఎత్తుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఇప్పటివరకు వాటి ఆచూకీ దొరకలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుల దొంగల ముఠా గుట్టు రట్టు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరుతూ శుక్రవారం ఆయన వీడియో విడుదల చేశారు. సంగారెడ్డిలోని తన ఇంటి వద్ద పెంచుకుంటూ పూజలు చేసే ఆవుల్లో ఆరింటిని అక్టోబరులో కొందరు అపహరించారని.. వాటి దూడలు మాత్రమే మిగిలాయని వాపోయారు. చోరీపై సంగారెడ్డి పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసులు వెతుతున్నప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదని చెప్పారు. మరోవైపు మేతకు వదిలిన ఆవులను కొందరు కబేళాలకు తరలిస్తున్నారని, తనవే కాక సంగారెడ్డి పట్టణ, పరిసర ప్రాంతాల్లో చాలా ఆవులు, ఎద్దులను ఎత్తుకెళ్లారని వీడియోలో వివరించారు. ఇలాంటివి జరుగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆవుల అపరహణపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  సంగారెడ్డి పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - 2020-12-26T07:51:33+05:30 IST