కోవిడ్-19పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

ABN , First Publish Date - 2020-04-15T21:34:40+05:30 IST

కోవిడ్-19పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

కోవిడ్-19పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్: కోవిడ్-19పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నగరంలో కరోనా కేసులు పెరగడంపై దృష్టి సారించిన ఆయన.. కరోనా కట్టడిపై అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఇతర వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో కేసులు అవుతున్న నేపథ్యంలో సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మే 3నాటికి నగరంలో ఒక్క కేసు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఈ భేటీలో ఓల్డ్‌ సిటీపై ప్రత్యేక చర్చకు రాగా..  పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారని ప్రగతిభవన్ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-04-15T21:34:40+05:30 IST