కామారెడ్డిలో జంట హత్యల కలకలం

ABN , First Publish Date - 2020-06-26T14:45:40+05:30 IST

కామారెడ్డి గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్ (45), కోయల లక్ష్మయ్య (60)లను గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో కొట్టి హతమార్చారు. సుధాకర్ బీడీ

కామారెడ్డిలో జంట హత్యల కలకలం

కామారెడ్డి: కామారెడ్డి గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్ (45), కోయల లక్ష్మయ్య (60)లను గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో కొట్టి హతమార్చారు. సుధాకర్ బీడీ కాలనీలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా, కోయల లక్ష్మయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత వివాదాలతోనే హత్యలు జరిగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-26T14:45:40+05:30 IST