వినియోగదారులు ఫిర్యాదులు ఇలా చేయండి
ABN , First Publish Date - 2020-03-25T21:34:23+05:30 IST
తెలంగాణ లాక్‌డౌన్ నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యాపారులు అక్రమ దందాకు తెర లేపారు.

హైదరాబాద్: తెలంగాణ లాక్‌డౌన్ నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యాపారులు అక్రమ దందాకు తెర లేపారు. నిత్యావసర సరుకులను అధిక ధరలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మమ్మల్ని ఎవరేం చేస్తారు? అన్నధీమాతో చిన్నవ్యాపారుల మొదలుకుని హోల్‌సేల్ వ్యాపారులు కూడా ధరలను పెంచి అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే సరుకులు రావడం లేదని, కొరత ఉందని అంటున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రజలు అధిక ధరలు చెల్లించి సరుకులు కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధిక ధరలకు సరుకులను విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. వినియోగ దారులు ఎవరైనా ఫిర్యాదులు చేసిన వెంటనే సదరు వ్యాపారుల పై చర ్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారుల పై సమాచారం ఇవ్వాల్సిందిగా తెలంగాణ పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. ఈమేరకు వినియోగ దారులు తమ ప్రాంతాల్లోఅధిక ధరలకు నిత్యావసర సరుకులు అమ్ముతున్న వారి సమాచారాన్ని 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు కానీ, 7330774444 వాట్సప్ నెంబర్‌కు, హైదరాబాద్ వాసులు టోల్ ఫ్రీ నెంబర్, 180042500333 నెంబర్‌కు నానీ, 040-23447770 చీఫ్‌రేషనింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలి. వాట్సప్, ల్యాండ్‌లైన్ నెంబర్‌లు 24గంటలూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి రోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. వినియోగ దారులు తమ ప్రాంతంలో ఎవరైనా అధిక ధరలకు నిత్యావసర సరుకులను అమ్మినా, రేషన్ లబ్ధిదారులు షాపుల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా పై నెంబరకు ఫోన్‌చేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.