వరంగల్‌లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

ABN , First Publish Date - 2020-03-14T00:01:48+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తం కరోనా విస్తరిస్తోంది. వరంగల్‌లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. దుబాయ్ నుంచి దంపతులు హన్మకొండ వచ్చారు.

వరంగల్‌లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్‌లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దుబాయ్ నుంచి దంపతులు హన్మకొండ వచ్చారు. రెండ్రోజులుగా దంపతులు జ్వరంతో బాధపడుతున్నారు. వీరిని కరోనా ఐసోలేషన్ వార్డుకు ఎంజీఎం వైద్యులు తరలించారు. ఇప్పటికే జిల్లాలో కరోనా లక్షణాలతో నిట్ విద్యార్ధి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.


మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఇటీవల అమెరికాలో ఒక సదస్సులో పాల్గొని వరంగల్‌కు వచ్చాడు. ఈ రోజే జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. పెగడపల్లి మండలం లింగపూర్‌ యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు సమాచారం. తీవ్ర జ్వరం, జలుబుతో యువకుడు ఆస్పత్రిలో చేరాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి యువకుడు వచ్చినట్లు గుర్తించారు.  


Updated Date - 2020-03-14T00:01:48+05:30 IST