ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు: రాకేశ్‌ మిశ్రా

ABN , First Publish Date - 2020-05-12T01:36:37+05:30 IST

కరోనా డేంజర్‌ ఇప్పట్లో తీరేది కాదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తేల్చి చెప్పారు. కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎంల మాటలు వాస్తవమేనని చెప్పారు.

ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు: రాకేశ్‌ మిశ్రా

హైదరాబాద్: కరోనా డేంజర్‌ ఇప్పట్లో తీరేది కాదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తేల్చి చెప్పారు. కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎంల మాటలు వాస్తవమేనని చెప్పారు. జులై, ఆగస్ట్ నాటికి దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భౌతిక దూరం, వీలైనన్ని టెస్టులతోనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. 30 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ తేలేకపోయామని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటిక్‌తో కలిసి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నామని, ప్లాస్మా థెరపీతో కొంత వరకే ఉపయోగం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా లక్షణాలు లేనివారికి కూడా పాజిటివ్ రావటం ఆందోళనకరమన్నారు. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని రాకేశ్‌ మిశ్రా చెప్పారు.

Updated Date - 2020-05-12T01:36:37+05:30 IST