తెలంగాణలో సర్వం బంద్

ABN , First Publish Date - 2020-03-24T01:16:59+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పడక్బంది వ్యూహం రచిస్తోంది. ఇందులోభాగంగా కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.

తెలంగాణలో సర్వం బంద్

హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పడక్బంది వ్యూహం రచిస్తోంది. ఇందులోభాగంగా కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ  విధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఏడు గంటలు దాటడంతో తెలంగాణలో కర్ఫ్యూ ప్రారంభమైంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రోడ్లపై వాహనాలు కనిపిస్తే సీజ్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కిరాణా షాపులతో సహా సర్వం బంద్ కానున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు ఆదేశిస్తున్నారు.


ఇప్పటికే ఆదివారం పాటించిన బంద్‌ మరో 9 రోజులు కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా స్థానికులకు వ్యాపించకుండా నిలువరించడం అత్యంత కీలకమని, దీని కోసం మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌ చేస్తున్నామని ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పేదలు, కూలీలు ఇబ్బంది పడకుండా తెల్ల కార్డుదారులకు రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా బియ్యంతోపాటు కుటుంబానికి రూ.1500 నగదు ఇస్తామని ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఆయన ఉన్నతస్థాయిలో సమీక్షించారు.

Updated Date - 2020-03-24T01:16:59+05:30 IST