కరోనాను సమష్టిగా ఎదుర్కోవాలి: రాఘవులు

ABN , First Publish Date - 2020-04-14T09:31:11+05:30 IST

కరోనా మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొవాలని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఆ పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజలను, వలస కార్మికులను, పేదలను ప్రత్యేక

కరోనాను సమష్టిగా ఎదుర్కోవాలి: రాఘవులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొవాలని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఆ పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజలను, వలస కార్మికులను,  పేదలను ప్రత్యేక పథకం ద్వారా ఆదుకోవాలని  విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకులతో మాట్లాడారు. కరోనా నివారణ, సేవా కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై చర్చించారు. వైరస్‌ వ్యాప్తి చేసినట్లు చైనాపై దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. చైనా ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు  సమాచారం అందించిందని చెప్పారు.  ఉద్యోగుల వేతనాలు కోత పెట్టడం సరి కాదన్నారు.

Updated Date - 2020-04-14T09:31:11+05:30 IST