హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా

ABN , First Publish Date - 2020-05-11T18:01:42+05:30 IST

హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా

హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా

హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్‌లో రెండు నెలల పసికందు, నాలుగు సంవత్సరాల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. నవరంగ్‌గూడలో కరోనా వైరస్ సోకిన వృద్ధ మహిళకు చెందిన కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఇరువురు చిన్నారులకు పాజిటివ్‌‌ అని తేలినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం బేగంపేట్ ప్రకృతి వైద్యశాల ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-11T18:01:42+05:30 IST