గాంధీ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయింది: మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-03-13T03:10:57+05:30 IST

కరోనా వైరస్‌పై స్టేట్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశమైంది. గాంధీ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయిందని తెలంగాణ మంత్రి ఈటల అన్నారు

గాంధీ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయింది: మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై స్టేట్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశమైంది. గాంధీ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయిందని తెలంగాణ మంత్రి ఈటల అన్నారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌ రాలేదని, ఎయిర్‌పోర్టులో ప్రతి విదేశీ ప్రయాణికుల్ని స్క్రీన్‌ చేస్తున్నామని ఈటల తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారికి 104 కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్లు చేసి సమాచారం తీసుకుంటున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించవద్దని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Updated Date - 2020-03-13T03:10:57+05:30 IST