యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కు కరోనా

ABN , First Publish Date - 2020-06-05T03:29:56+05:30 IST

యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కు కరోనా

యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కు కరోనా

యాదాద్రి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జలుబుతో బాధపడుతూ గత నెల 29వ తేదీ నుంచి కానిస్టేబుల్ సెలవులో ఉన్నారు. కోవిడ్-19 పరీక్ష చేయగా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. మిగతా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-06-05T03:29:56+05:30 IST