కరోనా, పల్లె ప్రగతిపై చర్చకు అనుమతి:పోచారం
ABN , First Publish Date - 2020-03-13T09:38:45+05:30 IST
కరోనా, పల్లె ప్రగతిపై ప్రత్యేక చర్చకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతి ఇచ్చారు. ఈ రెండు అంశాలపై ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో ప్రత్యేక స్పల్ప కాలిక చర్చ జరుపుతామని

హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కరోనా, పల్లె ప్రగతిపై ప్రత్యేక చర్చకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతి ఇచ్చారు. ఈ రెండు అంశాలపై ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో ప్రత్యేక స్పల్ప కాలిక చర్చ జరుపుతామని, సభ్యులు దీనిపై మాట్లాడవచ్చని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై గురువారం సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. ఈ వైర్‌సను నియంత్రించడానికి అన్ని రకాల చర్యల్ని తీసుకున్నట్టు చెప్పారు. కరోనాపై చర్చించడానికి బీఏసీలో సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.