కరోనా కాలంలో వెరైటీ పోలీస్.. ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-15T00:58:23+05:30 IST

కల్వకుర్తిలో లాక్‌డౌన్ ఈ నెల 30 వరకు పొడిగించడంతో ద్విచక్రవాహనదారులకు ఇంటి నుంచి బయటకు...

కరోనా కాలంలో వెరైటీ పోలీస్.. ఎక్కడో తెలుసా?

నాగర్ కర్నూల్: కల్వకుర్తిలో లాక్‌డౌన్  ఈ నెల 30 వరకు పొడిగించడంతో ద్విచక్రవాహనదారులకు ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ.. వచ్చిన వారికి మాస్కులు వాడాలని కల్వకుర్తి ఎస్సై మహేందర్ సూచించారు. ఇతర ప్రాంతాలకు చెందిన ద్విచక్రవాహనదారులు మాస్కులు ధరించకుండా వచ్చే వారిని గుర్తించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్సై మహేందర్ గులాబీలు అందజేసి ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించకుండానే చాలా మందిలో కరోనా పాజిటివ్ అని బయటపడుతూ ఉండటంతో సమస్యలు తలెత్తున్నాయని, అనారోగ్యంతో ఉన్న వారు మాత్రమే మాస్కులు ధరించాలని గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను మార్పు చేసి తెలంగాణ ప్రభుత్వం బయటకు వచ్చిన వారు కార్యాలయాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో రహదారిపై ద్విచక్ర వాహనదారులకు మాస్కు ధరించాలని గులాబీ పువ్వులను ఇచ్చి కోరడం జరిగింది. 

Updated Date - 2020-04-15T00:58:23+05:30 IST