ఉపాధి లేక సొంత ఊర్లకు వెళ్తున్న వలస కార్మికులు
ABN , First Publish Date - 2020-04-27T03:21:47+05:30 IST
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా భాగ్యనగరంలో చిక్కుకుపోయి, ఉపాధి లేక వందలాది మంది వలస కూలీలు తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ కిస్మాత్ నగర్ నుంచి పెద్దపల్లి రైల్వే ట్రాక్ గుండా సుమారు 50 మంది వలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వలస కూలీలకు చెప్పులు లేకుండా, చంటి పిల్లలతో కాలినడకన చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తున్నారు.