హైదరాబాద్ లో కానిస్టేబుల్, మరో మహిళకు కరోనా

ABN , First Publish Date - 2020-05-31T00:05:23+05:30 IST

హైదరాబాద్ లో కానిస్టేబుల్, మరో మహిళకు కరోనా

హైదరాబాద్ లో కానిస్టేబుల్, మరో మహిళకు కరోనా

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రెస్ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం మహిళను గాంధీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. 

హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో మరో పోలీసుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. కానిస్టేబుల్ కు  కోవిడ్ -19 లక్షణాలు కలిగి ఉండటంతో పరీక్షలు నిర్వహించి గాంధీకి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-05-31T00:05:23+05:30 IST