హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-05-30T22:07:28+05:30 IST

హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మరో ఇద్దరికి కరోనా

హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మరో ఇద్దరికి కరోనా

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రామంతాపూర్ కామాక్షిపురంలో నివసించే ఓ వ్యాపారికి, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన అతని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇద్దరు కరోనా బాధితులను అధికారులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-05-30T22:07:28+05:30 IST