‘కరోనా’ పాజిటివ్‌ వచ్చిన యువతి ఎవరెవర్ని కలిసింది..?

ABN , First Publish Date - 2020-03-16T14:06:11+05:30 IST

ఇటలీకి వెళ్లి వచ్చిన యువతికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో..

‘కరోనా’ పాజిటివ్‌ వచ్చిన యువతి ఎవరెవర్ని కలిసింది..?

  • ఆరా తీస్తున్న అధికారులు
  • నగర శివారు ప్రాంతంలో..
  • సన్నిహితులను కలిసినట్లు సమాచారం


హైదరాబాద్‌ : ఇటలీకి వెళ్లి వచ్చిన యువతికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. ఇప్పుడు ఆమె ఎవరెవరిని కలిసింది..? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. కొత్తగూడెంకు చెందిన 24 ఏళ్ల యువతి ఈ నెల 7న ఇటలీ నుంచి వచ్చిన విషయం విదితమే. ఆమెకు జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి నమూనాలు సేకరించి నిర్ధారించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించారు.


అలాగే స్థానికంగా ఆమె ఎవరెవరితో కలిసి సన్నిహితంగా ఉంది అనే విషయాలపై ఆరా తీయగా.. ఆ యువతి ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతానికి వచ్చి అక్కడ సన్నిహితులను కలిసినట్లు గుర్తించారు. అక్కడ ఆమె దాదాపు 30 మందికిపైగా కలిసినట్లు తేలింది. ఇప్పుడు వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికి సిద్ధమయ్యారు. కొందరిని ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు తీవ్రతను బట్టి వారిని ఆస్పత్రికి తరలించి నమూనాలు సేకరించాలని యోచిసున్నట్లు సమాచారం.

Updated Date - 2020-03-16T14:06:11+05:30 IST