ఎన్‌ఐటీ విద్యార్థికి ఐసోలేషన్ వార్డులో చికిత్స: డీఎంఅండ్‌హెచ్‌వో

ABN , First Publish Date - 2020-03-13T17:29:52+05:30 IST

ఎన్‌ఐటీ విద్యార్థికి ఐసోలేషన్ వార్డులో చికిత్స: డీఎంఅండ్‌హెచ్‌వో

ఎన్‌ఐటీ విద్యార్థికి ఐసోలేషన్ వార్డులో చికిత్స: డీఎంఅండ్‌హెచ్‌వో

వరంగల్: అమెరికా వెళ్లి వచ్చిన ఎన్‌ఐటీ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఎంజీఎం ఐసోలేషన్ వార్డులో చికిత్స అందజేస్తున్నామని డీఎంఅండ్‌హెచ్‌వో లలిత తెలిపారు. శుక్రవారం కరోనా లక్షణాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఎన్‌ఐటీ విద్యార్థి ఆరోగ్య వివరాలను లలిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏబీఎన్‌తో మాట్లాడుతూ అతడి నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్, పూణెకు పంపించామని, 24 గంటల్లో తొలి రిపోర్ట్ వస్తుందని చెప్పారు. అయితే మొదటి రిపోర్ట్‌తోనే కరోనా కన్ఫామ్ కాదని అన్నారు. కొవిడ్ 19 పాజిటివ్ అయితే అతడిని హైదరాబాద్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. విదేశాలకు వెళ్లి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని లలిత తెలిపారు. 

Updated Date - 2020-03-13T17:29:52+05:30 IST