తెలంగాణలో కరోనా కేసుల తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2020-08-20T16:47:32+05:30 IST

తెలంగాణలో కరోనా కేసుల తాజా అప్‌డేట్

తెలంగాణలో కరోనా కేసుల తాజా అప్‌డేట్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. నిన్న 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 97,424కి చేరింది. నిన్న ఒక్క రోజు కరోనా వైరస్ తో 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 729కి చేరింది. ఒక్క రోజే కరోనా బారి నుంచి 1,195 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 75,186కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,509గా ఉంది. ఇప్పటి వరకు 8,21,311 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న నమైదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 395, మేడ్చల్ లో మాల్కాజిగిరిలో 105, కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి జిల్లాలో 169, సూర్యాపేట 44, మంచిర్యాల 45, నల్లొండ 67, సంగారెడ్డి 45, సిద్దిపేట 61, వరంగల్ అర్బన్ 91, నిజామాబాద్ జిల్లాలో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-20T16:47:32+05:30 IST