రూ.18కే హ్యాండ్‌ శానిటైజర్‌!

ABN , First Publish Date - 2020-03-15T09:41:10+05:30 IST

కరోనా వైరస్‌ భయంతో జనం మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్ల కోసం ఎగబడుతుండటంతో బహిరంగ మార్కెట్‌, ఆన్‌లైన్‌లో కూడా వీటికి భారీ డిమాండ్‌ నెలకొంది.

రూ.18కే హ్యాండ్‌ శానిటైజర్‌!

ప్రపంచ ప్రమాణాలతో ఇంట్లోనే తయారీ

వీడియో రూపొందించిన విశ్వేశ్వర్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

 కరోనా వైరస్‌ భయంతో జనం మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్ల కోసం ఎగబడుతుండటంతో బహిరంగ మార్కెట్‌, ఆన్‌లైన్‌లో డా వీటికి భారీ డిమాండ్‌ నెలకొంది. ఈ పరిస్థితిని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఇక పేరున్న కంపెనీల హ్యాండ్‌ శానిటైజర్‌ ధర రూ.100పైనే ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్ములాకు అనుగుణంగా అతి తక్కువ ధరకు ఇంట్లోనే హ్యాండ్‌ శానిటైజర్‌ను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తూ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అపోలో ఆసుపత్రి అధినేత డాక్టర్‌ ప్రతా్‌పరెడ్డి అల్లుడైన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తొలినుంచి ఇలాంటి కొత్త అంశాలపై పరిశోధనలు చేస్తూ ఉంటారు.


Updated Date - 2020-03-15T09:41:10+05:30 IST