కరోనా చికిత్సకు అదనపు ధరలు సరికాదు
ABN , First Publish Date - 2020-06-25T08:56:26+05:30 IST
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు జనరల్ వార్డులో చేరిన వారికే వర్తింపజేయడం సరికాదని ఆ ఆస్పత్రుల బాధితుల

ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం
హైదరాబాద్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు జనరల్ వార్డులో చేరిన వారికే వర్తింపజేయడం సరికాదని ఆ ఆస్పత్రుల బాధితుల సంఘం పేర్కొంది. ఇతర రోగాలు, ఎమర్జెన్సీ వెంటిలేటర్ వంటి వాటికి అదనపు రేట్లు ఉంటాయని హాస్పిటల్స్ చెప్పడం దారుణమని పేర్కొన్నది. దీనిపై దృష్టిపెట్టాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను సంఘం అధ్యక్షుడు జగన్ కోరారు.