నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కరోనా

ABN , First Publish Date - 2020-12-30T07:16:01+05:30 IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లివచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకోగా

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కరోనా

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లివచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకోగా మంగళవారం పాజిటివ్‌గా తేలింది. కాగా, రాష్ట్రంలో కొత్తగా 397 మందికి వైరస్‌ సోకింది. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 2,85,465కు, మరణాలు 1,535కు చేరాయి. 627 మంది డిశ్చార్జితో రికవరీల సంఖ్య 2,77,931కు పెరిగింది. 5,999 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 92, మేడ్చల్‌లో 37, రంగారెడ్డి జిల్లాలో 28, కరీంనగర్‌లో 25 నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 756 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,396 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-30T07:16:01+05:30 IST