కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా!

ABN , First Publish Date - 2020-11-06T07:46:04+05:30 IST

మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కరోనా బారినపడ్డారు. తాను, తన వ్యక్తిగత సిబ్బంది కొవిడ్‌ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని బుధవారం రాత్రి ఎమ్మెల్యే స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా!

తెలంగాణలో 1,539 కొత్త కేసులు.. 5 మరణాలు

 మంథని/హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కరోనా బారినపడ్డారు. తాను, తన వ్యక్తిగత సిబ్బంది కొవిడ్‌ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని బుధవారం రాత్రి ఎమ్మెల్యే స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తామంతా ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నామని వెల్లడించారు. తన ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దన్నారు. కాగా.. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.


గురువారం మరో 1,539 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 2,45,682కు చేరింది. వైరస్‌తో మరో ఐదుగురు మృత్యువాత పడటంతో మరణించిన వారి సంఖ్య 1,362కు పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 285 మందికి పాజిటివ్‌ రాగా, రంగారెడ్డి జిల్లాలో 123 మందికి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 102 మందికి, కరీంనగర్‌ జిల్లాలో 86 మందికి, ఖమ్మం జిల్లాలో 78 మందికి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 82 మందికి వైరస్‌ సోకింది. 


Updated Date - 2020-11-06T07:46:04+05:30 IST