స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2020-05-24T09:36:54+05:30 IST
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు రూరల్, మే 23: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం, అమ్మాపురం, మడిపల్లి గ్రామాలకు వచ్చిన వలసకూలీలకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయా గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా బాధితులున్న గ్రామాల్లో ప్రజలకు అధికారులు అన్ని జాగ్రత్తలు తెలిపి భరోసానివ్వాలని సూచించారు.
ప్రతీఒక్కరు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్పారు. క్వారంటైన్ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు, నిత్యావసర సరుకుల సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా బాధితులకు మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. మంత్రి వెంట డీఎంహెచ్‌వో శ్రీరాం, ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీపీ అంజయ్య, తహసీల్దార్ రమేష్‌బాబు, ఎంపీడీవో బాబు, సీఐ చేరాలు, ఎస్సై నగేష్ ఉన్నారు.