వినూత్న ఆలోచనలకు మద్దతివ్వాలి

ABN , First Publish Date - 2020-04-24T10:29:01+05:30 IST

కరోనా కట్టడికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వినూత్న (ఇన్నోవేటివ్‌) ప్రయత్నాలు, ఆలోచనలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ పలువురు వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరారు.

వినూత్న ఆలోచనలకు మద్దతివ్వాలి

 కరోనా కట్టడికి సహకరించాలి

వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరిన కేటీఆర్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వినూత్న (ఇన్నోవేటివ్‌) ప్రయత్నాలు, ఆలోచనలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ పలువురు వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పలు వెంచర్‌ క్యాపిటలిస్టులు, స్టార్ట్‌పల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. దేశంలోని పలువురు వెంచర్‌ క్యాపిటలిస్టులు కలిసి ఆక్ట్‌ గ్రాంట్స్‌ (అఇఖీ ఎఖఅూఖీఖి) పేరిట సుమారు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. స్టార్టప్‌ కమ్యూనిటీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరికొత్త ఆలోచనలతో కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఆక్ట్‌ గ్రాంట్స్‌ ద్వారా కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు వినూత్నమైన ఆలోచనలకు, ప్రయత్నాలకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా క్యాపిటిస్టులు కేటీఆర్‌కు తెలిపారు. కరోనా కట్టడికి ముందుకొచ్చే స్టార్టప్‌ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-04-24T10:29:01+05:30 IST