తెలంగాణలో కొత్త రకం వైరస్ ఉందా?.. లేదా..?...

ABN , First Publish Date - 2020-12-25T22:24:12+05:30 IST

తెలంగాణను సెకండ్ వేవ్ భవం వెంటాడుతోంది. కొత్తరకం వైరస్ ఉందా?. లేదా? అని శాంపిల్స్‌ను సీసీఎమ్‌బీకి పంపారు. మరోవైపు అన్ని..

తెలంగాణలో కొత్త రకం వైరస్ ఉందా?.. లేదా..?...

హైదరాబాద్: తెలంగాణను సెకండ్ వేవ్ భవం వెంటాడుతోంది. కొత్తరకం వైరస్ ఉందా?.  లేదా? అని శాంపిల్స్‌ను సీసీఎమ్‌బీకి పంపారు. మరోవైపు అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా కొత్త కరోనా అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రానికి యూకే నుంచి దాదాపు 1200 మంది వచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ దాదాపు 850 మందిని ట్రేస్ చేసింది. అందులో 350 మంది శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మిగతా అన్ని శాంపిల్స్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. నెటిటివ్ వచ్చిన వీళ్లందరిని హోంక్వారంటైన్‌లో 14 రోజుల పాటు ఉండాలని, వాళ్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లకుండా అందరూ క్వారంటైన్ పాటించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్ వచ్చిన ఏడుగురిలో నలుగురిని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని వివిధ చోట్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. 

Updated Date - 2020-12-25T22:24:12+05:30 IST