కరోనా నిబంధనలు పాటించాల్సిందే

ABN , First Publish Date - 2020-11-27T08:06:56+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల

కరోనా నిబంధనలు పాటించాల్సిందే

 నేతలు నియమావళిని ఉల్లంఘించి మాట్లాడొద్దు:ఎస్‌ఈసీ

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) ఆదేశించింది. ర్యాలీలు, ప్రదర్శనల సమయంలోనూ ఎక్కువ మొత్తంలో ప్రజలను ఒకే చోట సమూహపరచవద్దని సూచించింది.

ప్రచారంలో ఎన్నికల నియామావళి ఉల్లంఘించి కొందరు నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు మీడియా ప్రసారాల ద్వారా గమనించినట్లు తెలిపింది. ఇటువంటి వాటిని ప్రసారం చేయవద్దని మీడియాను కోరింది. 


Read more