హైదరాబాద్‌లో భయంకరంగా కరోనా కేసులు.. ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-06-19T03:35:57+05:30 IST
తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 352 పాజిటివ్ కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 352 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 195 మంది చనిపోయారు. 6,027 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 302 కేసులు, రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్‌లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ రూరల్, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. గురువారం 230 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,531 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
