ఇంట్లో ఉన్నా.. కరోనా బాధ తప్పలేదు
ABN , First Publish Date - 2020-05-23T21:18:11+05:30 IST
ఇంట్లో ఉన్నప్పటికీ ఓ యువకుడిని కరోనా వదల్లేదు. వివరాల్లోకెళితే.. సనత్నగర్ పరిధిలోని అశోక్ కాలనీలో ఓ యువకునికి(25) కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత
హైదరాబాద్: ఇంట్లో ఉన్నప్పటికీ ఓ యువకుడిని కరోనా వదల్లేదు. వివరాల్లోకెళితే.. సనత్నగర్ పరిధిలోని అశోక్ కాలనీలో ఓ యువకునికి(25) కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత యువకుడు.. ఇంటికే పరిమితం అయ్యారు. బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతూ మెడిసిన్ వాడుతున్నాడు. అయితే తాజాగా అతను టెస్టులు చేయించుకోవడానికి వెళ్లగా.. కరోనా టెస్టులు కూడా చేశారు. ఈ టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. యువకుని సోదరులు బయటకు వెళ్లి వచ్చిన సందర్భంలో వారి నుంచి వైరస్ రావొచ్చని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువకుడి కుటుంబ సభ్యులందరికీ మెడికల్ టెస్టులు చేస్తున్నారు. వారందరినీ ఇంట్లోనే హోం క్వారంటైన్ చేశారు. కాగా, పాజిటివ్ వచ్చిన యువకున్ని గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.