డబుల్ సెంచరీ క్రాస్ చేసిన కరోనా కేసులు.. తెలంగాణలో ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-12T03:30:09+05:30 IST

తెలంగాణలో కరోనా వీర విహారం చేస్తోంది. ఒకరి నుంచి ఒకరికి విస్తృతంగా వ్యాప్తిస్తోంది. దీంతో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు..

డబుల్ సెంచరీ క్రాస్ చేసిన కరోనా కేసులు.. తెలంగాణలో ఒక్కరోజే..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వీర విహారం చేస్తోంది. ఒకరి నుంచి ఒకరికి విస్తృతంగా వ్యాప్తిస్తోంది. దీంతో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 209 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందగా ఇప్పటివరకూ 165 మంది చనిపోయారు. గురువారం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 175 కేసులు నమోదు కాగా మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, వరంగల్ అర్బన్‌లో2 , మహబూబ్ నగర్‌లో 3, ఆసీఫాబాద్‌లో 2, సిద్దిపేటలో 2, కరీంనగర్‌లో 3, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 4,320 మందికి కరోనా పాజటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 2,162 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,993మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Updated Date - 2020-06-12T03:30:09+05:30 IST