యాదాద్రిలో తొలిసారి కరోనా కేసులు.. ఒకే రోజు..

ABN , First Publish Date - 2020-05-10T20:30:12+05:30 IST

యాదాద్రి : జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదు అయ్యాయి.

యాదాద్రిలో తొలిసారి కరోనా కేసులు.. ఒకే రోజు..

యాదాద్రి : జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకేరోజు నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్లలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో మరొకరికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ నెల 5న ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులుగా గుర్తించారు. పల్లెర్ల నుంచి మరో ఆరుగురిని, జనగాం నుంచి మరో నలుగురిని బీబీనగర్ నిమ్స్‌ లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-05-10T20:30:12+05:30 IST