తెలంగాణలో ఆరు కేసులే

ABN , First Publish Date - 2020-04-16T02:00:09+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతమయ్యాయి. తాజాగా ఒక్కరోజే ఏకంగా 37 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 681కు చేరింది. ఈరోజు 118 మందిని డిశ్చార్జ్‌ చేశామని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఆరు కేసులే

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో 15 రోజుల తర్వాత కాస్త ఊరట! బుధవారం 400 నమూనాలను పరీక్షించగా కేవలం ఆరు పాజిటివ్‌ కేసులే నమోదయ్యాయి. మార్చి 31 నుంచి రోజూ కనీసం 15కు తగ్గకుండా కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 650కి చేరగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 514కు చేరింది. ఇప్పటి వరకు వైర్‌సతో 18 మంది మృత్యువాత పడగా.. బుధవారం ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదు. బుధవారం పరీక్షించిన నమూనాల్లో ఎక్కువగా హైదరాబాద్‌వే ఉన్నాయి. పాజిటివ్‌లు వచ్చిన వాటిలో కరీంనగర్‌ నుంచి 1, వికారాబాద్‌ నుంచి 3, హైదరాబాద్‌లో 2 చొప్పున ఉన్నాయి. గురువారం 128 మందిని డిశ్చార్జ్‌ చేయాలని నిర్ణయించారు. వారికి బుధవారం పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. గురువారం మరోమారు పరీక్షలు నిర్వహించి, ఫలితాలు మళ్లీ నెగెటివ్‌ వస్తే డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-04-16T02:00:09+05:30 IST