తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు.. హైదరాబాద్‌లో ఒక్కరోజే...
ABN , First Publish Date - 2020-06-23T02:52:13+05:30 IST
తెలంగాణలో తాజాగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ ...

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 8,674 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మొత్తం 217 మంది చనిపోయారు. సోమవారం హైదరాబాద్‌లోనే 713 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, మంచిర్యాలలో 5, సంగారెడ్డిలో 12, వరంగల్ అర్బన్‌లో 1, వరంగల్ రూరల్‌లో 6, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్‌లో రెండేసి కేసులు, కామారెడ్డి, మెదక్‌లో మూడేసి కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 274 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 4,005 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 4452 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

