ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు చుక్కలు చూపించిన కరోనా బాధితుడు
ABN , First Publish Date - 2020-07-10T17:14:24+05:30 IST
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా బాధితుడు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు చుక్కలు చూపించాడు.

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా బాధితుడు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు చుక్కలు చూపించాడు. రామగుండానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వచ్చిన గంట సేపటికే తాను ఇక్కడ ఉండనని.. ఇంటికి వెళ్తానంటూ ఆసుపత్రి ఆవరణలో గంట సేపు ఆసుపత్రి సిబ్బందిని, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు రేపు పంపిస్తామంటూ పోలీసులు సర్ది చెప్పడంతో ఐసోలేషన్ వార్డులోకి వెళ్ళాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.