అన్ని జిల్లాల్లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-06-18T09:23:12+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది.

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సమావేశం బుధవారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని సమావేశం కోరింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు విజృంభించడం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న నిరసనదినం పాటించాలని సమావేశంలో తీర్మానించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.