తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా తీవ్రం

ABN , First Publish Date - 2020-03-23T10:08:59+05:30 IST

తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా తీవ్రం

జాబితాలో హైదరాబాద్‌, రంగారెడ్డి,  మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం

ఏపీలో కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం

దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 75 జిల్లాలు


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెలాఖరు వరకు అత్యవసర సేవలు మినహా మిగతావాటిని నిలిపివేయడం సహా ఈ జిల్లాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, కరోనా కేసులు వెలుగుచూసిన కరీంనగర్‌కు ఈ జాబితాలో చోటులేదు. ఇదే పరిస్థితి ఉన్న 22 రాష్ట్రాల్లోని 75 జిల్లాల జాబితాను ఆదివారం విడుదల చేయగా అందులో ఏపీలోని కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం ఉన్నాయి. 

Updated Date - 2020-03-23T10:08:59+05:30 IST