కరోనా అనుమానంతో మృతదేహం అడ్డగింత

ABN , First Publish Date - 2020-07-22T09:06:05+05:30 IST

కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలను

కరోనా అనుమానంతో మృతదేహం అడ్డగింత

  • పోలీసు బందోబస్తుతో అంత్యక్రియలు.. 30మందిపై కేసులు

ఖమ్మం క్రైం, జూలై 21: కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. వైద్యులు, రెవెన్యూ సిబ్బంది ఎంత చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో.. చివరకు పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలను పూర్తి చేశారు. అడ్డుకున్న సుమారు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయనకు కరోనా లేదని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం నగర శివారులోని శ్శశానవాటికకు తీసుకువెళ్లారు. కానీ ఆ వ్యక్తి కరోనాతో చనిపోయినట్లు తెలిసిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంత్యక్రియలు ఈ శ్మశానవాటికలో నిర్వహించకూడదని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అయినా కూడా వినిపించుకోకపోవడంతో 30 మందిపై కేసు నమోదు చేశారు. బందోబస్తు మఽధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-07-22T09:06:05+05:30 IST