అదుపులోనే కరోనా

ABN , First Publish Date - 2020-03-28T09:54:56+05:30 IST

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌

అదుపులోనే కరోనా

ఒక్కరు కూడా మరణించలేదు

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి గవర్నర్‌ నివేదిక

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆరా తీయగా.. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదన్నారు.


ఒకరిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని, ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందున్న రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 20,475 మందిని హోమ్‌ క్వారంటైన్‌లో పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో రెండో కేటగిరిలో 151 ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. ఐసోలేషన్‌ వార్డులను సమకూర్చడానికి  23 ప్రైవేట్‌ ఆస్పత్రులు ముందుకొచ్చాయన్నారు.

Updated Date - 2020-03-28T09:54:56+05:30 IST